చెరుకూరు గ్రామంలో భారీ కొండచిలువ పట్టివేత

Written by telangana jyothi

Published on:

చెరుకూరు గ్రామంలో భారీ కొండచిలువ పట్టివేత

 – సి.జి సరిహద్దు అడవుల్లో స్వేచ్ఛగా కొండసిలువ విడుదల

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చెరుకూరు గ్రామంలో, భారీ కొండచిలువ గ్రామ వీధుల్లో ప్రత్యక్షమైంది. ఇటీవల గోదావరి వరదలకు ఎక్కడ నుండో కొట్టుకు వచ్చిన కొండచిలువ గ్రామాల్లోకి ప్రవేశించింది. సమాచారాన్ని వాజేడు పారెస్టు రేంజి ఆఫిసర్ కు తెలియపరిచారు. మండల కేంద్రమైన వెంకటాపురం చెందిన స్నేక్ క్యాచర్ భార్గవ్ చౌదరి కి కొండచిలువ విషయంపై ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు .ఈ మేరకు ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తులు సమక్షంలో స్నేక్ క్యాచర్ భార్గవ్, చేతులతో కొండచిలువను సురక్షితంగా బంధించాడు. 12 అడుగుల పొడవు, సుమారు 25 కేజీల బరువు గల కొండ సిలువ పాము దాదాపు గ్రామస్తులను-ప్రయాణికులను రెండు గంటల పాటు హడలెత్తి చ్చింది . గ్రామస్తుల సమాచారం మేరకు చెరుకూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చరణ్ సమాచారాన్ని మండల ఉన్నత అధికారులకి చేరవేయగా, వెంకటాపురం మండలంలో ని సోషల్ స్నేక్ క్యాచర్ , ఉచిత సేవను అందిస్తున్న భార్గవ్ చౌదరి ని ఫారెస్ట్ అధికారులు సంప్రదించగా. ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు సంఘటనా స్థలంలోకి వచ్చారు. ఆ కొండచిలువతో దాదాపు 30 నిమిషాల పాటు పోరాడి,చాకచక్యంగా , తన చేతులతో దాన్ని బంధించారు. తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతమైన టేకులగూడెం వద్ధ దట్టమైన అటవి కొండ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో,సమక్షంలో దాన్ని రిలీజ్ చేశారు. పాముని పట్టుకోగానే చెరుకూరి గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ కేచింగ్, ఉచిత సేవలను అందిస్తున్న భార్గవ్ కి, ఫారెస్ట్ అధికారులతో పాటు- గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now