మంథని పేరును మంటగలిపిన మంథని ఎమ్మెల్యే
– బాకీపడ్డ హమీలపై ఇంటింటికి అవగాహన కల్పించాలే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం,అక్టోబర్04,తెలంగాణజ్యోతి:దేశంలో మంత్రిపురిగా చదువులు వేదాలకు నిలయంగా పేరుగాంచిన మంథని పేరు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ మంట గలుపుతున్నాడని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు అధికారం కోసం అనేక హమీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 22నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని, ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీకార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును గడపగడపకు తీసుకెళ్లి ప్రజలను అప్రమత్తం, చైతన్యం చేస్తూ ఇచ్చిన హమీలు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగేందుకు రావాలని కాంగ్రెస్ నాయకులను నిలదీసేలా ప్రజలకు అవగాహణ కల్పించాల న్నారు. అయితే నిత్యం బీఆర్‌ఎస్ పార్టీపై తనలాంటి బీద బిడ్డపై విషం కక్కే మీడియా సంస్థలు సైతం 420హమీలకు రూపకల్పన చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ నీతిని సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. 420హమీలు రాసిన దుద్దిళ్ల శ్రీధర్ చదువుకున్న వ్యక్తిగా రాజకీయ కుటుంబంలో పుట్టిన వాడిలా చలామణి అవుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. 22నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి 55వేలు, వృద్దులు వితంతులు,బీడి కార్మికులకు 44వేలు, దివ్యాంగులకు 44వేలు, ఆడబిడ్డలకు తులం బంగారం, చిన్నారులు కళాశాలకు వెళ్లే స్కూటీలు, ఫీజురియింబర్స్ మెంట్ కింద వివిధ సంస్థలకు 8వేల కోట్లు బాకీ ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే రైతు భరోసా కింద ఒక్కో రైతుకు 76వేలు, రుణమాఫీ 80శాతం కూడ పూర్తి చేయకుండా అనేక మంది రైతులకు రెండు లక్షల చొప్పున బాకీ ఉందన్నారు. రైతు కూలీలకు 24వేలు, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 88వేలు, విద్యాభరోసా కార్డు ఇస్తమని చెప్పిన ప్రభుత్వం ఒక్కొక్కరికి 5లక్షలు, ఉచిత బస్సుతో మోసపోయిన ఆటో అన్నలకు రెండేళ్లలో 24వేలు బాకీ ఉన్నట్లు వివరించారు. 200యూనీట్లు ఫ్రీ అని చెప్పినా ఎక్కడా అది అమలు కావడం లేదని, ఇల్లు లేని నిరుపేదకు ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కట్టించ లేదన్నారు. ఉద్యమకారులను మభ్యపెట్టిండ్లు 250చదరపు గజాల ఇంటి స్థలం 5లక్షలు ఇస్తమని మోసం చేశారని, రాజీవ్ యువకిరణాల పేరు నాలుగు సార్లు దరఖాస్తులు తీసుకుని దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఇలా హమీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌ను ఉపేక్షించుకుంటూ పోతే వాళ్ల మోసాలకు హద్దులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే కాదు ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్లు ఓట్లు వస్తే నోట్ల సంచులు, పథకాలను చూపి వాటిని అమలు చేయకుండా మోసం చేసే వాళ్ల గురించి సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే చీకటే తప్ప వెలుగులు ఉండవని, 78ఏండ్లలో 50ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఇప్పటికి చీకట్లోనే ఉంచిందన్నారు. దేశం నుంచి మొదలై రాష్ట్రం గ్రామం వరకు కాంగ్రెస్ అనాదిగా మోసం చేస్తూనే వస్తుందన్నారు. ఈసారి ఎమ్మెల్యే కుటుంబం మంథని నియోజక వర్గాన్నే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. మంథని పేరును మంట గలుపుతున్న మంథని ఎమ్మెల్యేకు ఎన్ని అవార్డులు, వరల్డ్ రికార్డులు ఇచ్చిన తక్కువేనని, ఇంత జరుగుతున్నా మంథని ఎమ్మెల్యే చీమకుట్టినట్లు కూడా కావడం లేదని, మళ్లీ ఎన్నికలు వస్తే నోట్ల సంచులతో వచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవచ్చనే ఆలోచన ఉందన్నారు. 22నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడిందని, ఆ విషయాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని, మన పోరాటంతో కాంగ్రెస్ పార్టీలో చీకట్లో ఉన్న వాళ్లకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. మనం అధికారం కోసం కాదు ప్రజల కోసమే పని చేస్తున్నామని, అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం మెడలు వచ్చి పనులు చేయిం చాలన్నారు. ఆనాడు ఎమ్మెల్యే ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు రివ్వ్యూ మీటింగ్ పేరుతో పనులు చేయవద్దని చెప్పిన చరిత్ర మంథని ఎమ్మెల్యేదని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త ఒక్క క్షణం కూడా అలసత్వం చేయకుండా కాంగ్రెస్ బాకీ కార్డును గడపగడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్థేశం చేశారు.