షెడ్యూల్డ్ ప్రాంత ఇసుక క్వారీల్లో మ్యాన్‌పవర్ ఉపయోగించాలి
– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్
వెంకటాపురం నూగూరు, జూన్3, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలు ఇప్పుడు దళారీ వ్యవస్థ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సొసైటీల్లో నిబంధనలను తుంగలో తొక్కుతూ రాత్రింబ వళ్లు భారీ యంత్రాలతో (జెసిబి, టిప్పర్లు) ఇసుక తరలింపు జరుగుతుంటే అధికారులు మాత్రం మౌనంగా ఉండిపోతు న్నారని విమర్శించారు. పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైంద న్నారు. బినామీల రాజ్యం పెరిగిపోవడంతో స్థానిక ఆదివాసులు ఉపాధి అవకాశాల నుంచి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీల్లో మానవ వనరులను ఉపయోగిం చాలని, స్థానిక ఆదివాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తుర్స కృష్ణబాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, కుర్సం శంకర్, తాటి నాగరాజు, బొగ్గుల ప్రశాంత్, కుర్సం రమేష్, బొగ్గుల సమ్మయ్య, సంజయ్, నవదీప్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.