వాజేడు నాగారం హైస్కూల్‌లో మట్టి వినాయక విగ్రహాల తయారీ

వాజేడు నాగారం హైస్కూల్‌లో మట్టి వినాయక విగ్రహాల తయారీ

వాజేడు నాగారం హైస్కూల్‌లో మట్టి వినాయక విగ్రహాల తయారీ

వెంకటాపురం, ఆగస్టు26, తెలంగాణజ్యోతి :  పర్యావరణానికి హాని కలిగించని ప్రకృతి హిత వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ములుగు జిల్లా వాజేడు నాగారం ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు స్వయంగా మట్టి గణపతులను తయారు చేసి, వాటిని సహ విద్యార్థులకు పంపిణీ చేశారు. కృత్రిమ రసాయనాలతో తయారయ్యే విగ్రహాలు వాడితే వాయు, జల, వాతావరణ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, చల్లగురుగుల మల్లయ్య, వెంకట రమణ, రంగు ఆనంద్, పోరిక రవి కుమార్, బొగ్గం కుమార్ బాబు, కంచు ప్రభాకర్, షిండే రాజేష్, కోకిల శ్రీ రంగం, జర్పుల వస్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment