నాంచారమ్మ జాతరను విజయవంతం చేయండి

Written by telangana jyothi

Published on:

నాంచారమ్మ జాతరను విజయవంతం చేయండి

– మే 23న నాంచారమ్మ జాతర

– ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాంచారమ్మ జాతర చైర్మన్ లోకిని రాజు 

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: భక్తులు, ఎరుకల కులస్తు లు అధిక సంఖ్యలో తరలివచ్చి నాంచారమ్మ జాతరను విజయవంతం చేయాలని ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాంచారమ్మ జాతర చైర్మన్ లోకిని రాజు పిలుపు నిచ్చారు. ఆదివారం మండలంలోని రామానుజాపూర్ గ్రామ సమీప పంట పొలాల మధ్య ఉన్న నాంచారమ్మ ఆలయం వద్ద ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేతిరి బిక్షపతి, పల్లకొండ భాస్కర్ లతో కలిసి జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. దేవుళ్ళకే ఎరుక చెప్పిన నాంచారమ్మ తల్లి జాతరను ప్రతి సంవత్సరం మే 23 వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజనులలో ఎరుకలు , వారి జాతరలన్న ప్రభుత్వాలకు పట్టింపు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతర వరకు గత ప్రభుత్వంలో రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందని, ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన నాంచారమ్మ జాతరను విప్పి కుప్ప పెట్టారని అన్నారు. పునర్నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన పట్టించు కోలేదన్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నాంచా రమ్మ ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సీతక్కకు ప్రతిసారి ఆహ్వానం అందిస్తున్నా మని ఇప్పటివరకు రాలేదని, ఈసారి జాతరకు వచ్చి అమ్మ వారి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. నాలు గు రాష్ట్రాల ఎరుకల కులస్తులు, ములుగు జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన జాతరల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్నారు. నాంచారమ్మ జాతర కమిటీ చైర్మన్ లోకిని రాజ, సభ్యులుగా పల్లకొండ భాస్కర్, పాలకుర్తి సురేష్, దేవర్ల సతీష్ ,దేవర్ల గణేష్ ,కేతిరి అశోక్ ,కోనేటి రాజు ,మానుపాటి రమేష్, దాసరి గంగయ్య ,పాలకుర్తి ప్రమీల ,కూరాకుల సరోజన, లోకిని సమ్మయ్య ,కోనేటి సమ్మయ్య ,పాలకుర్తి నారాయణ, బుణాద్రి రంజిత్ కుమార్ ,దుగ్యాల బాబు, శ్రీరాముల పోచయ్య ,కుతటి కుమార్ స్వామి ,కేతిరి సారయ్య ,కుతటి సమ్మయ్య, పల్లగొండ ఎల్లా స్వామి, పులిచెరు సారయ్య ,కేతిరి రాజశేఖర్ ,ఓని సదానందం, పల్లకొండ ప్రభాకర్ ,కూరాకుల సారయ్య ,దుగ్యాల రమేష్, మేడ బంగారయ్య, కూరాకుల పెద్ద మల్లయ్య ,పాలకుర్తి సమ్మయ్య, సుల్తాన్ సుధాకర్, కుతాటి శ్రీనివాస్ తదితరులు సంఘ నాయకులు ఉన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now