మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి

మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి

మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి, జూలై20, తెలంగాణజ్యోతి: భూపాలపల్లి నియోజక వర్గంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన నున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజక వర్గ కాంగ్రెస్ శ్రేణులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంత్రుల పర్యటన షెడ్యూల్‌ను వివరించారు. ఉదయం 11 గంటలకు కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జెన్కో సీఎస్ఆర్ నిధులతో రూ.5.5 కోట్ల బస్ స్టేషన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేస్తారు. అలాగే, అదే గ్రామంలో జరిగే సభలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. భూపాలపల్లి భాస్కరగడ్డలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించిన అనంతరం, ఎస్పీ కార్యాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. చివరగా, పోలీస్ స్టేషన్ ఎదురుగా సింగరేణి సీఎస్ఆర్ నిధులతో రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన జిల్లా గ్రంధాలయాన్ని మంత్రులు, ఎంపీలు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల న్నింటిలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment