మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయండి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మాలల సమస్యలపై భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరం సాగించేం దుకు, ఐక్యత కోసం నిర్వహించే మాలల సింహ గర్జన సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్ విజ్ఞప్తి చేశారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యం లో హైదరాబాదులో ఆదివారం జరప తలపెట్టిన మాలల సింహగర్జన సభను రాజకీయా లకతీతంగా, కులాలకు అతీతంగా, ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని కోరారు. ఏ కులానికి ఈ సభ వ్యతిరేకం కాదని, ఇది కేవలం మాలల సమస్యలపై, వివక్షతకు వ్యతిరేకంగా, మాలల హక్కుల సాధ న కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు పీకకిరణ్ వెల్లడించారు.