మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ను ఆదివాసులకే కేటాయించాలి.

మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ను ఆదివాసులకే కేటాయించాలి.

 – తెలంగాణ రాష్ట్ర మాజీ ఆదివాసీ సర్పంచుల ఫోరమ్ కోశాధికారి.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రానున్న లోక్ సభ ఎన్నికలలో మహబూబాబాద్ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ టికెట్టును ఆదివాసులకే కేటాయించాలని ఆదివాసి సర్పంచుల ఫోరం మాజీ కోశాధికారి, ములుగు జిల్లా వాజేడు మండల సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ అధిష్టాన వర్గానికి విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రకటనను గురువారం వెంకటాపురం లో మీడియాకు విడుదల విడుదల చేశారు. ములుగు, భద్రాచలం, ఇల్లందు, పినపాక నియోజక వర్గాలలో అత్యధికంగా ఆదివాసులు ఉన్నందున, రాజకీయ అనుభవం ఉన్నా, బి అర్ ఎస్ పార్టీ టికెట్ ను ఆదివాసీ గిరిజన అభ్యర్ధి కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో నిలుపుతే అత్యధిక మెజారిటీతో విజయం సాధించి , మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయం సాదిస్తారని , ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గెలుపొందిన ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, మండలాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం చేసే ఆదివాసి నాయకులను మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసి, ఎన్నికల పోటీ బరిలో నిలపాలని, బి ఎస్ పార్టీ రాష్ట్ర అధిష్ఠానాన్ని మాజీ సర్ఫంచ్. ల సంఘం నేత పూసం నరేష్ విజ్ఞప్తి చేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment