వీవర్స్ కాలనీలో మహా అన్నదానం
మట్టి గణపతికి మహా పూజలు
ములుగు, సెప్టెంబర్ 1, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా వారాహి రెస్టారెంట్ యజమానులు బొమ్మగాని హైమావతి–జగదీశ్వర్ దంపతులు వ్యవహరించగా ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొలువుదీరిన మట్టి గణేషునికి భక్తులు ఘనమైన పూజలు చేసి వేద పండితుడి నుంచి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాసాని రామ్మూర్తి, కొండి రవీందర్, కందకట్ల భాస్కర్, కొండి సదానందం, మోతే శ్రీనివాస్, పౌడాల ఓం ప్రకాష్, చిందం చందు, స్నేహిత్, మహిపాల్, లతో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.