గణేష్ నవరాత్రులలో మహా అన్నదానం

గణేష్ నవరాత్రులలో మహా అన్నదానం

గణేష్ నవరాత్రులలో మహా అన్నదానం

ములుగు, సెప్టెంబర్ 3, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో కొలువుదీరిన గణనాయకుని నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజు మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు నరేందర్ గణపతికి కుంకుమపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం కనుకుంట్ల శ్రీలత-మల్లేష్, కూరపాటి కవిత-నరేష్ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పౌడాల ఓం ప్రకాష్, నాంపల్లి రాజు, కొండి మహిపాల్, చిందం చందు, స్నేహిత్, నామాల సాయి, మండ సిద్దు, అభిలాష్, హర్షవర్ధన్ లతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment