ములుగులోని గణేష్ చౌక్ వద్ద  మహా అన్నదానం 

ములుగులోని గణేష్ చౌక్ వద్ద  మహా అన్నదానం 

ములుగులోని గణేష్ చౌక్ వద్ద  మహా అన్నదానం 

ములుగు, ఆగస్టు 31, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై గణేష్ చౌక్ వద్ద కొలువు దీరిన గణనాథుని మంటపం వద్ద శ్రీ వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు విశేషంగా కొనసాగు తున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రధానార్చకులు సముద్రాల శ్రీనివాసచార్యులు నిర్వహిస్తున్న పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సామ్రాజ్ రాకేష్–పద్మ దంపతులు (పూల వ్యాపారి) లు నేటి మహా అన్నదాతలుగా నిలిచి భక్తులకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో 700 మందికి పైగా భక్తులు పాల్గొని ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఇమ్మడి రాకేష్ యాదవ్, కొత్త సురేందర్, సానికొమ్ము శ్రీనాథ్ రెడ్డి, ఎల్లావుల అశోక్, బైకాని మధు, ఎల్కతుర్తి శివ, కోయిల కవిరాజ్, కళ్లెపు ప్రవీణ్, నగర బోయిన రాజు, నాగ సాయి, అమ్ము, అఖిల్, పండు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment