వీవర్స్ కాలనీలో గణనాయకుని వద్ద మహా అన్నదానం
ములుగు, సెప్టెంబర్4, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రం లోని వీవర్స్ కాలనీలో కొలువుదీరిన గణనాయకుని వద్ద గురువారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిం చారు. గణపతికి అర్చకుడు నరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి శీలం శ్రీలత ప్రవీణ్ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పౌడాల ఓం ప్రకాష్, నాంపల్లి రాజు, కొండి మహిపాల్, చిందం చందు, స్నేహిత్, నామాల సాయి, మండ సిద్దు, అభిలాష్, హర్షవర్ధన్ లతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.