ఆధార్ కార్డు ఉంటేనే మధ్యాహ్న భోజనం..!
– ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి ఆధార్ కార్డు లేదని మధ్యాహ్న భోజనం పెట్టని సంఘటన చోటు చేసుకుంది. గిరిజన అభివృద్ధే ధ్యేయమనీ చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ నిరుపేద పేద గిరిజన విద్యార్థికి ఏటువంటి న్యాయం చేస్తారని గ్రామ గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి… ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ శ్రీరంగాపురం గ్రామానికి చెందిన భూక్య జీవన్ అనే విథ్యార్ది జిపిఎస్ కొండాపురం ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. తండ్రి మృతి చెందటంతో తల్లి పద్మ కూలీనాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నది. అయితే విద్యార్థి జీవన్ కు ఆధార్ కార్డు లేకపోవడంతో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అతనికి భోజన సదుపాయం కల్పించడం లేదని, తన తోటి విద్యార్థులందరికీ భోజనం పెడుతుండగా ఆథార్ కార్డు లేదని నేపంతో జీవన్ కు భోజనం పెట్టమని కరాకండిగా ఉపాధ్యాయులు చెబుతున్నారని చెబు తుండటం కన్నీటి పర్యంతం అయింంది. శ్రీరంగాపురం నుండి కాలినడకన కే. కొండాపురం జిపిఎస్ పాఠశాలకు చేరుకునే విద్యార్థికి ఆధార్ కార్డు నెపంతో పాఠశాాలలో భోజనం పెట్టకపోవడం చోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థి భూక్య జీవన్ కు ఆధార్ కార్డు కొరకు ఆరు నెలల క్రితం వెంకటాపురం మీసేవ కేంద్రంలో ఆధారాలతో ఆధార్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల హెచ్.ఎం స్టడీ సర్టిఫికేట్ ను సైతం ఆధార్ కార్డు కోసం జత చేసి ధరఖాస్తు చేసుకున్నారు. అయినా కానీ పాఠశాల యాజమాన్యం కనికరించకుండా అన్నం పెట్టటం లేదని తల్లి పద్మ ఆవేదన వ్యక్తంచేశారు. కొడుకుకు మధ్యాహ్న భోజనం, తన కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కులం సర్టిఫికెట్, ఇందిరమ్మ ఇల్లు, మంజూరు చేయా లని ములుగు జిల్లా కలెక్టర్, ఐటిడిఎ అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది.