ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తులపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలి. 

ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తులపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలి. 

– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో బుదవారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70 పీసా చట్టాలు, ఆదివాసులకు ప్రత్యేక హక్కులూ భారత రాజ్యాంగం కల్పించి నప్పటికీ వెంకటాపురం మండలంలో ప్రభుత్వ భూములు నూగూరు (G)సర్వేనెంబర్ 23, 69/1,76లలో గిరిజనేతరులు యదే చ్చగా బహుళ అంతస్తులు, నిర్మాణాలు పుట్టగొడుగుల వలె పుట్టుకొస్తున్నయన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారని ధ్వజమెత్తారు. అధికారుల అండ దండలు పుష్క లంగా ఉండటంతో, భూమి క్రయ విక్రయాలు చేస్తూ, ఏజెన్సీ ప్రాంత 1/70 చట్టాన్ని ఉల్లం ఘిస్తున్నారని మండి పడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలోని బహుళ అంతస్తులపై ఎల్.టి.ఆర్ కేసుల నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్శ కృష్ణబాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి కంతి నేత్రనంద్ కుమార్, రాజేష్, మధు తది తరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment