అమల్లోకి వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల కోడ్
– జెండాలు తొలగింపు – విగ్రహాలకు ముసుగులు
వెంకటాపురం, సెప్టెంబర్30,తెలంగాణజ్యోతి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో పార్టీ జెండాలు, తోరణాలను తొలగించారు. రాజకీయ పార్టీల స్వర్గీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు. వెంకటాపురం మండల కేంద్రంలోని వేప చెట్టు సెంటర్, బస్ స్టాండ్ సెంటర్ వద్ద ప్రముఖ నేతల విగ్రహాలకు పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ పర్యవేక్షణలో సిబ్బంది ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా ఏ రాజకీయ కార్యక్రమం నిర్వహించరాదని, ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.