ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం : ఆదివాసి నాయకులు

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం : ఆదివాసి నాయకులు

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం : ఆదివాసి నాయకులు

వెంకటాపురం, జూలై 27, తెలంగాణ జ్యోతి : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆగస్టు 9న ఘనంగా నిర్వహించాలని ఆదివాసి సంఘాల నాయకులు కలిసి వెంకటాపురం మండల అతిథి గృహంలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆదివాసి గ్రామాల్లో ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం వద్ద జరిగే వేడుకల్లో మండలం లోని ఆదివాసి సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తాత్కాలిక కార్యనిర్వాహక కమిటీని ఎన్ను కున్నారు. ఇందులో చింత సోమరాజు, పూనెం రామచంద్రరావు, గుర్రపు రామారావు, పూనెం చంటి, పర్శిక సతీష్, గొంది హనుమంత్, రేగ గణేష్, కణితి వెంకటకృష్ణ, తాటి లక్ష్మణ్, ఉండం రామచంద్ర ప్రసాద్, తాటి చందర్ రావు, సరస్వతి, క్రాంత్, పాయం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment