కుదురుపల్లి అంజన్నకు మకరతోరణం బహుకరణ
మహాదేవపూర్,జులై 29,తెలంగాణ జ్యోతి : శ్రావణ మాసం మంగళవారం నాగపంచమి సందర్భంగా కుదురుపల్లి గ్రామం ఆంజనేయస్వామి దేవాలయంలో నూతన మకరతోరణం ను ప్రారంభించారు. దీనిని పంచామృత గంగజలం తో అభిషేకం చేసి ఆంజనేయస్వామికి అలంకారం చేశారు. కరీంనగర్ వాస్తవ్యులు పరాంకుశం అచ్యుత్ నూతన మకరతోరణం ఆంజనేయస్వామి వారికి బహుకరించారు. దాత అచ్యుత్ వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో బాగుండాలని స్వామి వారికి పూజ చేసిన అర్చకులు నిశాంత్ ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి పూజలో మహాదేవపూర్ మండల పిఏసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ కోట లక్ష్మీ సమ్మయ్య, కాళేశ్వరం దేవాలయం డైరెక్టర్ దొడ్ల అశోక్, చల్ల మహేందర్, చల్ల సమ్మిరెడ్డి, రాంరెడ్డి, లెంకల వంశీ, సోయం సమ్మయ్య, శశికాంత్, శ్రీరాముల సాయి, ప్రదీప్ యూత్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భక్తులందరికి ఆలయ అర్చకులు తిరుణగరి నిశాంత్ స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.