ములుగులో కేటీఆర్ జన్మదిన వేడుకలు

ములుగులో కేటీఆర్ జన్మదిన వేడుకలు

ములుగులో కేటీఆర్ జన్మదిన వేడుకలు

ములుగు ప్రతినిధి, జూలై 24, తెలంగాణ జ్యోతి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినవేడుకలను ములుగులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గురువారం బీఆర్ఎష్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ పార్కు వద్ద నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ దారిలో నడుస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మార్గదర్శిగా కేటీఆర్ కొనసాగుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆశా కిరణంగా వెలుగొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరిక పోమనాయక్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు కోగిల మహేష్, వేములపల్లి బిక్షపతి, గరిగే రఘు, గండి కుమార్, ఆదిరెడ్డి, దాసరి రమేష్, దుర్గం రమణయ్య, రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, దొడ్డ వెంకటరెడ్డి, ఎండి లియాఖత్ అలీ, రాజ్ హుస్సేన్, భూక్య అమర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment