Ktr | గెలిపించండి : బస్ డిపో ఏర్పాటు చేస్తా – కేటీఆర్

Written by telangana jyothi

Updated on:

Ktr | గెలిపించండి : బస్ డిపో ఏర్పాటు చేస్తా – కేటీఆర్

– గాడిద కు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా..?
-కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుంది..
– సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది.
– ఇన్స్త్రాగ్రామ్ ఎమ్మెల్యేను కాదు.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే ఎమ్మెల్యే ను గెలిపించండి…
– రేవంత్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు ఉత్తరం రాయడం వల్లే రైతు బందు ఆగింది.
– కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుందామా..?
– కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు.. చెత్త పార్టీ…
– ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దు
– తల్లికి బువ్వ పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అంటే ఎలా?
– పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం డివిజన్ చేశాం : ఐటి మంత్రి తారక రామారావు

తెలంగాణ జ్యోతి, నవంబర్ 27, ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బారాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మంత్రి తారక రామారావు ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ బారాస అభ్యర్థి ఆదివాసి గిరిజన బిడ్డ అయిన బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించి ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జ్యోతిని గెలిపిస్తేనే ఏటూరు నాగారంకు బస్ డిపోను తెచ్చి ములుగు అభివృద్ధికి కృషి చేస్తాం లేకపోతే లేదన్నారు. గాడిద కు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా, కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ వారి మాటలు వింటే తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే వస్తాయా! యుద్ధంలో కత్తి వేరే వారికి ఇచ్చి వట్టి చేతులతో మమ్ములను కథనా రంగంలో దూకం అంటే ఎలా? రైతుల నోటికాడి బుక్క ఆగం చేసింది రేవంత్ రెడ్డి కాదా రైతుబంధు ఆపిన ద్రోహి రేవంత్ రెడ్డి కాదా ! అని ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు సైతం పోడు భూముల పట్టా ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి కాదా ?అని ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి ని ఓడించినా కానీ ములుగు నియోజకవర్గంపై ప్రేమతో ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఏర్పాటు చేశామని, మెడికల్ కాలేజీ , 200 పడకల ఆసుపత్రి , ఆర్టీవో అందుబాటులోకి తెచ్చామని మల్లంపల్లి ని మండలం గా ప్రకటిస్తూ, ఏటూరునాగారం అడవి ప్రాంత ప్రజల బాగోగులు చూసుకొనుటకు రెవెన్యూ డివిజన్ , డయాలసిస్ సెంటర్, తల సేమియా వ్యాధి నిర్మూలనకు కృషి , ఇలా చెప్పుకుంటూ పోతే బారాస ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుండి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు రైతుబంధు, రైతు బీమా, బీసీ బందు , మైనార్టీ బందు, తెలంగాణలోని దళితుల అభివృద్ధికి ప్రత్యేక దళిత బంధు కార్యక్రమాలెన్నో ప్రవేశ పెట్టారు పెట్టమన్నారు. సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇంచ్చిన ఘనత కేసిఆర్ దన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు ఉత్తరం రాయడం వల్లే రైతు బందు ఆగిందని, కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుందామా అని ప్రశ్నించారు. ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దన్నారు.

ఈసారి ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే గిరిజనులకు గిరిజన బందు , గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్క జాతర అభివృద్ధికి కృషి చేయడం, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలోని కృషి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో ప్రజల సంక్షేమo పెట్టుకొని పాలన చేస్తున్న దూర దృష్టి గల మేధావి కేసిఆర్ అన్నారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలవల్ల సుమారు 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర దీనికి కారణం నమ్మలేని ప్రణాళికలతో ప్రజలను మభ్యపెట్టి నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలతో ఓటు పొందాలని అత్యాశ పడుతున్నారన్నారు. కాంగ్రెస్,భాజపా పార్టీలకు ఓటు ద్వారా ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఇన్స్త్రాగ్రామ్ ఎమ్మెల్యేను కాదు.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే ఎమ్మెల్యే బడే నాగజ్యోతి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
సాదుకున్నా.. సంపుకున్నా మీరే: అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఆడ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. సాదుకున్నా? సంపుకున్నా? మీరే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో బారాస రాష్ట్ర నాయకులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బారాస ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now