Kishan Reddy | బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
డెస్క్: బీజేపీ అభ్యర్థుల తుది జాబితాపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల మూడు జాబితాలను విడుదల చేశామని, మిగిలిన స్థానాల క్యాండిడేట్ల పేర్లను ఇవాళ రాత్రి వరకు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 12వ తేదీన బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫస్ట్ లిస్ట్ లో 52 మందిని, సెకండ్ లిస్ట్లో కేవలం ఒకే అభ్యర్థిని, 35 మందితో థర్డ్ లిస్ట్ను బీజేపీ విడుదల చేసిన విషయం విధితమే.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ మూడు విడతల్లో 88 మంది పేర్లను ప్రకటించింది. మిగిలిన 31 స్థానాల అభ్యర్థుల పేర్లను ఇవాళ రాత్రి ప్రకటించనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.