Kcr | తెల్లం వెంకటరావుకు కెసిఆర్ అభినందనలు.
– మాజీ సీఎం కెసీఆర్ ను కలిసిన తెల్లం వెంకటరావు, నాయకులు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ఘన విజయం సాధించినందుకు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి అభినందనలు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, భద్రాచలం నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు తాత మధుసూదన్ తో పాటు, ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం బిఆర్ఎస్ నేత ఎన్నికల ఇన్చార్జి గుడవర్తి నరసింహమూర్తి, పార్టీ నాయకులు ముడుంబా శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు తో కలిసి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాదులో సోమవారం కలిశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదాలు పొందారు. భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఎం.ఎల్ సి.తాత మధుసూదన్ తనదైన శైలిలో ప్రచార చక్రం తిప్పి, కాంగ్రెస్ పార్టీని ఓడించారు. నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఎన్నికల ప్రచారం ఇన్చార్జీలు గూడవర్తి నరసింహమూర్తి, వెంకటా పురం మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు,వాజేడు ఎన్నికల ఇంచార్జి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య, వాజేడు మండల పార్టీ అధ్యక్షులు పి. కృష్ణారెడ్డి పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలను ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. పార్టీ ప్రచార కార్యక్ర మంలో పక్కా ప్రణాళికలతో గ్రామస్థాయిలో వారుచేసిన కృషిని మాజీ సిఎం కు ఎన్నికల ఇన్చార్జి తాతామధు వివరించారు. ఈ మేరకు భద్రాచలం నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని అభినందించారు .అలాగే భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట రావు తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని తాను ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీకి, ఆశయా లకు కట్టుబడి ఉండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ అండ దండలతో పని చేస్తానని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి సమక్షంలో అసత్య ప్రచారాలను ఖండింస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆశయాలకు అనుగుణం గా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత, మాజీ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు లను భద్రాచ లం ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరావు, ఎమ్మెల్సీ తాత మధు, వెంకటా పురం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
1 thought on “Kcr | తెల్లం వెంకటరావుకు కెసిఆర్ అభినందనలు. ”