నేడు కాటారం మండల పరిషత్ సమీక్ష సమావేశం
కాటారం,జులై7, తెలంగాణజ్యోతి : మండల పరిషత్ కార్యాల యంలో నేడు(మంగళవారం) ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అడ్డూరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమయానికి హాజరుకావాలని సూచించారు. సమావేశంలో రాబోయే వర్షాకాలంలో వరదల నివారణ చర్యలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, మంచినీటి వనరుల క్లోరినేషన్, పైపులైన్ల మరమ్మతులు, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాలపై సమీక్ష జరగనుందన్నారు. రెవిన్యూ, పంచాయతీ, నీటిపారుదల, వైద్య, ఐసీడీఎస్, విద్యాశాఖ, హాస్టల్ వెల్ఫేర్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనములు, పోలీస్, మత్స్యశాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలతో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.