కాటారం మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కాటారం మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కాటారం మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కాటారం, జూలై 5, తెలంగాణ జ్యోతి : కాటారం మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా మండల కేంద్రంలో నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మండల శాఖ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల అధికారిగా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి తణుకు శ్రీనివాస్ భూపాలపల్లి పరిశీలకులుగా భూపాలపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు పాలవరపు శ్రీనివాస్ వ్యవహరించారు. మండలంలోని ఆర్యవైశ్యులంతా కార్యక్రమానికి హాజరయ్యారు. మండల శాఖ అధ్యక్ష పదవికి మద్ది నవీన్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు బచ్చు ప్రకాష్ ప్రతిపాదించగా కలికోట శ్రీనివాస్ బలపరిచారు. మండల సంఘం ఎన్నికలకు ఎలాంటి పోటీ లేకపోవడంతో మద్ది నవీన్ కుమార్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తనుకు శ్రీనివాస్, పరిశీలకులు పాలారపు శ్రీనివాస్ ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య మండల శాఖ నూతన అధ్యక్షుడు నవీన్ కుమార్ ను భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా మద్ది నవీన్ కుమార్ ఎన్నికైన అనంతరం ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి రమేష్, కోశాధికారిగా దారం నందకిషోర్ లకు కార్యవర్గాన్ని విస్తరించినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆర్యవైశ్య మహాసభ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, అనంతుల శ్రీనివాస్ మండలం లోని ఆర్యవైశ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎన్నికల అధికారులుగా వచ్చిన తనుకు శ్రీనివాస్ పాలరపు శ్రీనివాస్, రాజులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి సదాశివ్, అనంతుల రమేష్ బాబు, మండల అవోపా అధ్యక్షుడు మద్ది లక్ష్మీ నరసింహమూర్తి,బచ్చు ప్రకాష్,కలికోట శ్రీనివాస్, రావికంటి అశోక్, మద్ది రాజబాబు, చందా విజయభాస్కర్, అల్లాడి చంద్రమౌళి, అల్లాడి ఓం ప్రకాష్, భీమారపు రాజబాబు,పడకంటి ప్రకాష్, మద్ది రవికుమార్, పల్లెపాటి ప్రకాష్, అల్లాడి మహేష్,చిట్టూరి శ్రీనివాస్,దారం సంతోష్, బీరెల్లి తిరుమలేష్, మద్ది శ్రీమన్ నారాయణ, అల్లాడి కిరణ్, చిట్టూరి రవీందర్ లు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని ఆర్యవైశ్య సంఘం సభ్యులంతా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్కోక్కరుగాఅభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment