కాటారం డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం
కాటారం జూన్ 24, తెలంగాణ జ్యోతి : కాటారం డివిజన్ కాటారం, మహాదేవపూర్,మలహార్, మహాముత్తారం, పలిమేల మండలాల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని బిఎల్ఎన్ గార్డెన్ లో జర్నలిస్టులు సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు అడప రమేష్ (10టీవీ), అధ్యక్షుడిగా పెండ్యాల రంజిత్ కుమార్ (వీ6 న్యూస్), ఉపాధ్యక్షుడిగా వీరమనేని సంపత్ రావు..( మహా న్యూస్),ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ షపిక్ హైమద్ (టీవీ5 న్యూస్),సహాయ కార్యదర్శిగా ములుకల రాజబాబు (సాక్షి టీవీ),కోళ్ల మహేష్ (ప్రైమ్ 9), కోశాధికారిగా షేక్ దీన్ మహమ్మద్ (రాజ్ న్యూస్),కార్యవర్గ సభ్యులు బత్తుల మహేష్.(హెచ్ఏం టీవీ),కీర్తి శ్రవణ్.(N టీవీ), కొక్కు సాకేత్ (ABN న్యూస్), బాసాని రాజబాబు (ఐన్యూస్), కమిటీ సభ్యులుగా సయ్యద్ జమీల్ (Tన్యూస్), వేల్పుల వెంకటేష్ (టీవీ9), ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని హామీ ఇచ్చారు.