కన్నాయిగూడెం ఆర్ఎంపీ, పీఎంపీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కన్నాయిగూడెం, ఏప్రిల్ 9, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలో ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా లక్ష్మిపురం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు వనం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా ముప్పనపల్లి గ్రామానికి చెందిన పంతంగి నాగరాజు పటేల్ (హనుమాన్ మెడికల్ స్టోర్స్ యజమాని)లను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఉపాధ్యక్షుడిగా సుగ్గుల సుధాకర్, కోశాధికారిగా బుద్దె సత్య నారాయణ బాధ్యతలు స్వీకరించగా, గౌరవ అధ్యక్షులుగా బరపాటి నర్సింహారావు, టక్కెడం దేవాసియా, గౌరవ సలహాదారులుగా తడకల జగన్, కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శులు మాట్లాడుతూ కమిటీ ఏకగ్రీవానికి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ, నియమనిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్, నరేష్, మహేందర్, శ్రీనివాస్, రాజశేఖర్, వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.









