కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గిరి రమణకే ఇవ్వాలి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : దక్షిణ కాశీగా వర్ధిల్లుతున్న కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గిరి మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన యువ నేత భాస్కర వెంకటరమణకు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేశారు. మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన యువ నేత భాస్కర వెంకటరమణ చిన్నప్పటినుంచి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ యు ఐ లో చురుకైన పాత్ర పోషిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అంకిత బావంతో పనిచేస్తున్నారని, నిజాయితీగల కార్యకర్తకు పెద్ద పీట వేయడం సమంజసమని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనకు చైర్మన్ ఇవ్వడం సముచితమని భావించి మంత్రివర్యులు శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేసినట్లు వెంకట రమణ విలేకరుల వివరించారు. తన తండ్రి, మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు సమకాలీకులని, అప్పటినుంచి ఇప్పటి వరకు దుద్దిల్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ పనిచేస్తున్నామని రమణ వివరించారు.