Kaleshwaram | ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా అధికారుల తీరు
– గర్భాలయం మూసి ప్రైవేట్ సాంగ్ షూటింగ్
– భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు..
– అధికారుల తీరుతో గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆగ్రహం.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో దేవదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు. సోమవారం గర్భగుడి తలుపు లు మూసి ప్రవేట్ సాంగ్ షూటింగ్ చేయడం పట్ల, ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. ఒకటి కాలేశ్వర శివలింగం కాగా, మరొకటి యముడు శివలింగం రూపంలో ఉంటుంది. ప్రైవేటు పాట చిత్రీకరణ కోసం దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆలయ తలుపులు మూసి పాట చిత్రికరించారు. అలాగే గర్భగుడి ఆలయం వెలు పల మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఎంతో విశ్వా సం కలిగిన ఈ ఆలయంలో ఎలాంటి ఫోటోలు వీడియోలు చిత్రీకరిం చవద్దని ఆలయ అధికారులె పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు ఏర్పాట్లు చేశారు. అవి కేవలం సామాన్య భక్తులకే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గర్భాలయంలో సినిమాలో చిత్రీకరించి నప్పుడు దేవదాయ శాఖ ఉన్నత అధికారుల అనుమతులు తీసుకోవలసి ఉండగా ఇక్కడి అధికారులు కొందరి మన్ననలు పొందడానికి వారికి ఇష్టం వచ్చినట్లు మౌఖిక అనుమతులు ఇస్తూ ఇలాంటి నిబంధనలు పాటించడం లేదని భక్తులు వాపో తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల మనో భావాలు దెబ్బతినకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు