భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
– అఖిలపక్ష నేతలకు వినతిపత్రం అందించిన నిర్వాసితులు
నారాయణపేట, జూలై 29, తెలంగాణ జ్యోతి : జిల్లా లోని దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో మక్తల్ –నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో జరుగుతున్న అన్యాయాన్ని తిప్పి చెబుతూ, నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు శీలం శ్రీనివాస్, కార్యదర్శి మొగలప్ప, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఘట్టనోళ్ల నరసింహా, సహ ఉపాధ్యక్షులు అశోక్, సురేష్ కుమార్, కోశాధికారి దానప్పతో పాటు నేతలు హనుమయ్య గౌడ్, పేరపల్ల వెంకటప్ప, బోవ్వోల్ల బోనప్ప, పూజారి అనిల్, ఆవుల రాజు, శ్రీనివాస్, కొటనికి నర్సింహులు, పలువురు రైతులు పాల్గొన్నారు. భూసేకరణలో తగిన పరిహారం, పునరావాస హక్కుల కోసం ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.