కుటుంబ భరోసా పథకంలో చేరి ప్రభుత్వ ఫలాలు పొందాలి
– ఫోటో, వీడియో గ్రాఫర్ల సంఘం తీర్మానం
వెంకటాపురం,జులై2,తెలంగాణజ్యోతి:ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ప్రతి ఒక్కరూ చేరి ప్రభుత్వ ఫలాలను పొందాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో తీర్మానించారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు వద్ద నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి వచ్చిన ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వృత్తి పరంగా ఎదుర వుతున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరై, సంఘం నాయకులను వాహనాలపై సన్నాయి మేళ తాళాలు, పూలవర్షంతో ఘనంగా ఆహ్వానించారు. కార్యక్రమా న్ని సందర్శించిన నాయకులు వృత్తి నైపుణ్యం పెంచుకోవడంలో టెక్నాలజీ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కుటుంబ భరోసా పథకంలో తప్పకుండా చేరాలని సూచించారు. ఫోటో, వీడియో గ్రాఫర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న డిమాండ్, అలాగే పథకాల అమలులో వారికి ప్రత్యేక స్థానం కల్పించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. వెంకట రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గడదాసు సునీల్, స్పందన యూనియన్ ప్రతినిధులు చంద్రకళ ప్రసాద్, రాగం సాంబశివరావు పటేల్, మాటూరి సతీష్, చెన్నం రాజు, దారిశెట్టి నాగేశ్వరరావు, బొల్లె నరసింహారావు, కుప్ప సాంబశివరావు, బన్నీ, బంధ రవి, వంకాయల రాము, చిట్యాల రవీందర్, పానెం సతీష్ అశోక్, సాయి, కిషోర్, రంజిత్, ఆనంద్, మనోజ్, తగరం భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.