Jio pay | త్వరలో మార్కెట్లోకి జియో పేమెంట్స్ .!
ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో మార్కెట్లోకి ఫోన్ పే, గూగుల్ పే తరహాలో జియో పేమెంట్స్ అందుబాటులోకి రానుంది. ఆన్లై న్ పేమెంట్స్ అగ్రిగేటర్ గా పనిచేయడానికి జియో ఫైనాన్షి యల్ సర్వీసెస్ లో భాగమైన జియో పేమెంట్ సొల్యూషన్స్ కు RBI అనుమతి ఇచ్చింది. ఫలితంగా వ్యాపారులు, విని యోగదారుల మధ్య డిజిటల్ పేమెంట్స్ నిర్వహించడానికి జియోకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తరహాలోనే త్వరలో జియో పేమెంట్స్ అందుబాటు లోకి రానుంది. దీనివల్ల ఆయా యాప్స్ కు గట్టి పోటీ తప్పద ని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.