వెంకటాపురంలో జననేత వైయస్సార్ 75వ జయంతి వేడుకలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురంలో సోమ వారం జననేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం ఆవరణలో, కాంగ్రెస్ నాయకులు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నేటికీ శిరస్మరణీయమని, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, కాంగ్రెస్ నాయకులు బాలసాని వేణు, వేల్పూరి సత్యనారాయణ, మురళి, రమేష్, టాకయ్య, మద్దకూరు ప్రసాద్ ,నాని, పల్నాటీ ప్రకాష్ ,మన్యం సునీల్, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకల్లో పాల్గొని, జననేత వైఎస్ఆర్ కు ఘనంగా నివాళు లర్పించారు.