ఎస్టి బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటిడిఏ పీఓ
వెంకటాపురం, జులై23, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో గల గిరిజన బాలుర వసతి గృహం, గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనాల పరిస్థితి, లోటుపాట్లను పరిశీలించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కిచెన్ షెడ్డు, కిటికీల మెష్‌లు, ముళ్లతీగల ఫెన్సింగ్, వంటపాత్రల కొరత, అదనపు టీచర్ల నియామకం, టాయిలెట్లు, పిఆర్సి భవన మరమ్మతులు, హాస్టల్ నుండి ప్రధాన రహదారి వరకు బీటీ రోడ్ నిర్మాణం తదితర అంశాలపై తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఆమె వెంట గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.