కాటారంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:రైతులకు కనీస మద్ద తు ధర చెల్లించేందుకు సీసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం మల్హర్ మండలం మార్కెట్ యార్డు, కాటారం మండలం, కాటారం గ్రామంలో సీసిఐ ఆధ్వర్యంలో మీనాక్షి ఆగ్రో కాటన్ కాటన్ మిల్లును ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మన దేశంలో చాలామంది రైతులు పత్తి పండిస్తున్నారని, తద్వారా పెద్ద ఎత్తున పత్తి సాగువు తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ చేయడం వల్ల ధర తగ్గి రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నదని తెలిపా రు. రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఇంపోర్టును పూర్తిస్థాయిలో బంద్ చేయాలని ఆయన తెలిపారు. రైతులు మద్దతు ధర కల్పించాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇస్తున్నారని తెలిపారు. 7521 రూపాయలు క్వింటాలకు తీసుకునే తరుణంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మార్కెటింగ్ అధికారి కనక శేకర్ తదితరులు పాల్గొన్నారు.