రైతుల వడ్ల కొనుగోలును తప్పుదోవ పట్టించడం సరికాదు

రైతుల వడ్ల కొనుగోలును తప్పుదోవ పట్టించడం సరికాదు

– లక్ష్మీదేవి పేట శ్రీ సాయి గ్రామక్య మహిళా సంఘాల నాయకులు

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : రైతుల వడ్ల కొనుగోలులో బి ఆర్ ఎస్ నాయకుడు తప్పు దోవ పట్టిస్తున్నాడని లక్ష్మీదేవి పేట ఐకెపి సెంటర్ నిర్వహిస్తున్న శ్రీ సాయి గ్రామక్య మహిళా సంఘం మహిళలు అన్నారు. బుధవారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఐకెపి సెంటర్లో మహిళా సంఘం నాయకులు మాట్లాడారు. రైతుల వడ్ల కొనుగోలులో విషయంలో తప్పుడు ఆరోపణలు చేసిన ముడిగె రాజు కుమార్ రైతుల వద్దకు వచ్చి నిజ నిర్ధారణ చేయాలని అన్నారు. రాజ్ కుమార్ మంగళవారం ఐకెపి సెంటర్ కు వచ్చి వడ్లు తీసుకోవాలని అన్నారని తెలిపారు. మా సంఘం నుండి బార్ధాన్ బస్తాలు ఇవ్వలేదు. మాకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. లారీ లోడ్ అయిన తర్వాత నా వడ్లు తీసుకోవాలని ఆరోపించారని పేర్కొన్నారు. ఐకెపి సెంటర్ నుండి అతని వడ్లు హమాలీతో కాంటా పెట్టలేదని అన్నారు. తప్పుడు ఆరోపణ చేస్తూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. రైతులకు పార్టీలకు ఏం సంబంధం పార్టీలకు అతీతంగా ఐకెపి సెంటర్ పనిచేస్తున్నామని అన్నారు. ఒకవైపు వర్షంతో రైతులు నష్టపోతున్నారు. రైతులు స్వయంగా మిల్లర్లతో మాట్లాడించి సెంటర్ నుండి వడ్లను పంపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గ్రామక్య సంఘం అధ్యక్షురాలు కారు పోతుల వాకులాదేవి, కార్యదర్శి తండ శారద ,బుక్ కీపర్ గుండ్ల రమేష్, రైతులు చక్రపాణి, తండ శీను ,హట్కర్ దేవేందర్, చెవుల ఓదెలు, మూడెం సాంబయ్య, మేక సాంబయ్య, తోట సాంబయ్య తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment