కోడిగుడ్లు, రాగి జావ అందించడం సాధ్యం కాదు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా వెంకటాపురం మండల కమిటీ సమావేశం శుక్రవారం కుడుముల సమ్మక్క అధ్యక్షతన గెస్ట్ హౌస్ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగా ణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ పాఠశాలలో వంటలు చేస్తున్న వంట కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయ న్నారు. మార్కెట్ ధరలకు ప్రభుత్వం ఇస్తున్న మెనూ చార్జీలకు ఏమాత్రం పొంతన లేకపోవడం మూలాన వంట కార్మికులు అప్పుల పాలు అవుచున్నారన్నారు. అందుకే మెనూ చార్జీలు, తరగతితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికి రూ 25 చెల్లించాలని, కోడిగుడ్లు, గ్యాస్, ప్రభుత్వ మే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కోడిగుడ్లు విధ్యార్థులకు అందించడం సాధ్యం కాదని అన్నారు. అలాగే 24 సంవత్సరాల సర్వీసు ధ్రుష్ట్యా చిన్నా చితకా కారణాలతో వంట కార్మికులను తొలగించకుండా జి.ఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అల్పాహారం, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎలాంటి పారితోషికం లేకుండా రాగి జావ అందించడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర నాయకురాలు సీతామహలక్ష్మి , ఏఐటి యుసి రాష్ట్ర నాయకులు సింగు నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కుడుముల సమ్మక్క, నాయకులు పోధెం సమ్మక్క, వట్టం పార్వతి, చాగంటి నాగమణి, గొడాషాల నాగేశ్వరి, అన్నవేణ జ్యోతి, చిట్టెం మల్లమ్మ, భధ్ధి రామలక్ష్మి, వాదం మధురవేణి, వేల్పుల తిరుపతమ్మ, పూసూరు రాధమ్మ, నాయకులు పోడెం కొండయ్య, వేల్పుల మల్లఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.