ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

ఏటూరునాగారం,జూన్ 21,తెలంగాణ జ్యోతి:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటూరునాగారం మండలంలోని ఎంపీపీ ఎస్. పాఠశాలలో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రధానోపాధ్యాయురాలు ఎం. స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా మెరుగవుతుందనే విషయాన్ని వివరిస్తూ, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి చురుకుతనం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు తమ దినచర్యలో యోగాను ఓ భాగంగా మార్చుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. వంశీ ప్రశాంత్, డి. సౌజన్య, జె. దమయంతి తదితరులు పాల్గొన్నారు. అలాగే అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు కూడా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment