వాజేడు హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
వెంకటాపురం, జూన్ 21, తెలంగాణాజ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు చల్లగురుగుల మల్లయ్య, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురించి వివరించి విద్యార్థుల చేత యోగాసనాలు వేయించారు. ధ్యానం, తాడాసన్, అర్థకటి చక్రాసన్, త్రికోణాసన్, బ్రామరీ ప్రాణాయామం, భస్త్రిక మొదలగు ఆసన, ధ్యాన, ప్రాణాయామ పద్ధతులను వివరిస్తూ విద్యార్థుల కు నేర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి వెంకటేశ్వర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావులు పాల్గొన్నారు. అనునిత్యం యోగ అభ్యాసం చేయడం వలన శారీరిక, మానసిక సమతుల్యత కలిగి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ప్రశాంతత కలుగుతుందని, వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందుతా రని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్,రంగు ఆనంద్, నూనావత్ శ్రీకాంత్, బొగ్గం కుమార్ బాబు, కంచు ప్రభాకర్, తెల్లం రాజ్యలక్ష్మి, షిండే రాజేష్, కోకిల శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.