బాలికలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు.

బాలికలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు.

  • ధైర్యాన్ని ప్రదర్శిస్తేనే బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తారు.
  • ఎసీడిపిఒ ముత్తమ్మ

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పరిరక్షణ అధికారి హరికృష్ణ అధ్యక్షతన అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విధ్యార్థులకు బాల్యవివాహాల నిర్మూలన మరియు బాలికల హక్కుల పరిరక్షణ, చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎసిడిపిఒ ముత్తమ్మ హాజరై మాట్లాడుతూ బాలికలు ఎన్నటికీ బాలహీనమైన వారు కారని వారు ఎంతో శక్తివంతమైన వారని అన్నారు. వారు దేశ అభివృద్ధి కి పట్టుకొమ్మలని అన్నారు. బాలికలు ఎంతో ఓపికగలవారని, కానీ తమపై వేదింపులు జరుగుతున్నప్పుడు, తమ హక్కులు ఉల్లంఘనకు గురవుతు న్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓపిక ప్రదర్శించాల్సిన అవసరం లేదని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు మాట్లాడుతూ బాలికలు కట్టుబాట్ల చట్రం లోనే బంధీలు కాకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించి సమాజానికి ఆదర్శ వంతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అప్పుడే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని అన్నారు. అనంతరం బర్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనిక మాట్లాడుతూ కిశోర బాలికలు తమ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని, ఎక్కువగా యుక్తవయస్సులో ఉన్న కిశోర బాలికలు రక్త హీనత కు గురవుతున్నoదున, రక్తహీనత ను నిరోధించే ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే నేడు కిశోర బాలికలు బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అనంతరం పరిరక్షణ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ సమాజం లో ఆడపిల్లల పై కొన్ని ఏళ్ళ పాటుగా వివక్ష కొనసాగి నందున బాలికల హక్కులకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయ ని దీనిని నిరోధించే ఉద్దేశ్యం తో బాలికల హక్కుల పరిరక్షణ మరియు వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించే ఉద్దేశ్యంతో, అంతర్జాతీయ స్థాయి లో బాలికా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,అన్నారు. అందులో భాగంగానే బాలికల హక్కులను హరించే సమస్యలను గురించి వివరిస్తూ,ఆయన మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం – 2006, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం – 2012, బాలకార్మిక నిషేదం మరియు క్రమబద్దీకరణ చట్టం – 2016 మరియు ఇతర బాలల హక్కుల పరిరక్షణ చట్టాలను గురించి వివరించారు. అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్  రజినీ మాట్లాడుతూ విధంగా పిల్లలకొరకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ 112 గురించి వివరిస్తూ ఆపత్కాలం లో ఉన్న పిల్లలకు 24X 7 సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సూపర్వైజర్లు శ్రీమతి పుష్పవతి, చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment