ఉపాధి హామీ కూలీలకు గాయాలు
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : మండలం లోని శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ఉపాధి హామీ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ టైరు ఊడి పోవడంతో ప్రమాదం జరిగింది. తోటి కూలీల వివరాల ప్రకారం.. పిట్టతోగు చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతిత పనులకు గ్రామంలోని కొంతమంది పనికి వెళ్లారు. ఈ క్రమంలో పని ముగించుకుని ట్రాక్టర్లో ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ టైరు ఊడి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళ కూలీలకు గాయాలు కాగా 108 ద్వారా ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. పరీక్షిం చిన వైద్యులు ఎంజీఎంకి రెఫర్ చేశారు