ఎండల దృష్ట్యా ఉదయం 11 గంటల వరకే ఉపాధి హామీ పనులు
– కలెక్టర్ ఉత్తర్వులు అమలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల్లో వేసవి ఎండలు తీవ్రత దృష్ట్యా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే పనులు చేయించాలని ప్రభుత్వ నుండి ఉత్తర్వులు జారి కాగా అమలవుతున్నాయి. ఈ మేరకు వెంకటాపురం మండలంలోని 18 పంచాయతీలలో సుమారు పదహారు పంచాయతీలలో వేలాది మంది కార్మికులు ఉపాధి హామీ పనులకు ఉదయం పూట నుండి వెళ్లి, 11 గంటలకు పని ముగించు కొని చల్ల పూట తిరిగి ఇళ్లకు వచ్చేస్తున్నారు. సుమారు 12 వేల మంది ఉపాధి హామీ కూలీలు రికార్డు నమోదు ఉండగా సుమారు 6 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నట్లు సమాచారం. నీటి కుంటల నిర్మాణం, పాం ఫాండ్లు, ఇతర పనులకు ఈజీఎస్ అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు మార్చి ఒకటో తేదీ నుండే అమల్లోకి రావడంతో ఈజీఎస్ ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కూలీలకు వేసవి ఎండల తీవ్రత, వడదెబ్బ తదితర జాగ్రత్తలు, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేకువ జామునే పనులకు హాజర అయ్యే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు పనుల వద్ద నీడ కల్పించేందుకు తాత్కాలిక టెంట్లతో పాటు, మంచినీటి వసతి ,ప్రథమ చికిత్స కిట్టు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి హామీ కూలీలు తెల్లవారుజామున కోడి కూతకు ముందే వంటలు చేసుకుని ఆహారాన్ని, టిఫిన్ క్యరియర్ లలో పట్టుకొని పనులకు వెళ్తుండ డంతో గ్రామాల్లో కోడి కూతనుండే కూలీల సందడి నెలకొంటున్నది.
1 thought on “ఎండల దృష్ట్యా ఉదయం 11 గంటల వరకే ఉపాధి హామీ పనులు”