గుర్రెవుల గ్రామంలో ఒకటి వెలుగుతే.. మరొకటి వెలుగదు..!
వీధి లైట్ల దుస్థితితో ప్రజలకు తలనొప్పి
కన్నాయిగూడెం, ఫిబ్రవరి9, తెలంగాణజ్యోతి : మండలంలోని గుర్రెవుల గ్రామంలో వీధి లైట్ల సమస్య గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఒక వీధి లైట్ వెలిగితే మరొకటి వెలగని పరిస్థితి నెలకొనడంతో రాత్రి వేళ గ్రామమంతా చీకటిమయంగా మారుతోంది. దీంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సర్పంచ్, ఉప సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే పనిచేయని వీధి లైట్లను మరమ్మతు చేయడంతో పాటు, ఈ నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.





