బిఆర్ఎస్ హయాంలోనే జోరుగా ఇసుక అక్రమ రవాణ

బిఆర్ఎస్ హయాంలోనే జోరుగా ఇసుక అక్రమ రవాణ

బిఆర్ఎస్ హయాంలోనే జోరుగా ఇసుక అక్రమ రవాణ

ఆరోపణలు కాదు ఆధారాలతో మాట్లాడాలి

మతి భ్రమించి అసత్య ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

కాటారం, జూలై 30, తెలంగాణ జ్యోతి : మంథని నియోజక వర్గంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జోరుగా ఇసుక అక్రమ దందా కొనసాగిందని యూత్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లుగా బిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని కాటారం మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో విమర్శించారు.తెల్లారి లేస్తే అధికార పార్టీ నాయకులపై బురదజల్లడానికి నిరదారనమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు వాస్తవాలు అయితే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రస్థాయి నాయకుల నుండి మండల స్థాయి నాయకుల వరకు పది సంవత్సరాల కాలంలో నిరంతరం రాత్రి పగలు లేకుండా అక్రమంగా ఇసుకను అధిక లోడుతో తరలించేవారనీ,మంథని నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కూడా తను కట్టుకున్న రాజగృహ ను అక్రమంగా తరలించిన ఇసుకతోనే నిర్మించుకున్నాడని ఆరోపించారు. అధికారం కోల్పోయాక కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులకి సంబంధించిన లారీ లు అధిక లోడుతో అక్రమంగా తిరుగుతున్నాయని గత కొన్ని రోజుల క్రితం పోలీస్ శాఖ పట్టు కున్న లారీ లు ఏ పార్టీ నాయకులకు సంబంధించి వ్యక్తిదో నిరూపించాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకొని ఆధారాలతో నిరూపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment