కనిపిస్తే తెలపండీ : ఎస్. ఐ. తిరుపతి రావు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం అటవీ ప్రాంతం పెంకవాగు గ్రామానికి చెందిన మడే లక్ష్మయ్య ఈ నెల ఒకటో తేదీన భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఈ మేరకు అతని సోదరుడు మడే పాపారావు వెంకటాపురం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. లక్షయ్య తరచూ మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మయ్య ఆచూకీ తెలిసినవారు వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే.తిరుపతిరావు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రజలను కోరారు. ఈ మేరకు మడే లక్ష్మయ్య సమాచారం తెలిసిన వారు 87126 70098, మరియు 8712670099 అనే సెల్ నెంబర్ లలో తెలియపరచాలని ఎస్సై కోరారు.