భార్యాభర్తల కాపురం నిలబెట్టిన దిశ వెల్ఫేర్ ఫౌండేషన్. 

Written by telangana jyothi

Published on:

భార్యాభర్తల కాపురం నిలబెట్టిన దిశ వెల్ఫేర్ ఫౌండేషన్. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భార్యా భర్తల మధ్య కలతలు, కలహాలు ఏర్పడ టంతో పాటు వారి ఇరువైపుల కుటుంబాల వారు కూడ సై అంటే సై అంటూ కలహాలతో అగ్నికి ఆజ్యం పోశారు. భార్యాభర్తలు ఎడ మొఖం ,పెడ ముఖం తో బార్య పుట్టింటికి వెళ్ళి పోయింది. సమాచారం తెలుసుకున్న ములుగు జిల్లా వెంకటాపురం దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ సంఘం మండల కమిటి భార్యాభర్తల కు కౌన్సిలింగ్ నిర్వహించి, ఇరువైపుల రెండు కుటుంబాలను ఒకటి చేసి కలహాలకు పులిస్టాఫ్ పెట్టారు. కాపురాన్ని నిలబెట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ శభాష్ అనిపించుకున్నారు. దిశా ఫౌండేషన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన వివరాల ప్రకారం ..ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన రామెల్ల నాగేశ్వరరావు నరసమ్మ దంపతుల కుమార్తె లలిత ని వరంగల్ పాక శ్రీలత కుమారుడు క్రాంతి కుమార్ కి ఇచ్చి వివాహం చేశారు. కొద్దికాలం పాటు వారి సంసార జీవితం సాఫీగా జరిగింది. అనంతరం కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె తమ పుట్టిల్లు అయిన బెస్తగూడెం గ్రామానికి పుట్టింటికి వచ్చేసింది. వారి పండంటీ కాపురంలో కలహాలు విషయం తెలుసుకున్న వెంకటాపురం దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ దృష్టికి రావడంతో, సంఘం మండల అధ్యక్షురాలు సోదరీమణి అట్టం సుభద్ర ఇరువైపుల కుటుంబాలను సంఘటిత పరిచి వాళ్లకు,ఇరువ్ పుల కౌన్సిలింగ్ తో పాటు అమల్లో వున్న మహిళా సంరంక్షణా చట్టాలపై ,అవగాహన కల్ఫించారు. . ఈ సందర్భంగా భార్యాభర్తలను ఒకటి చేసి అన్యోన్యంగా జీవించాలని వారి చక్కదిద్ది కాపురాన్నీ నిలబెట్టారు. వరంగల్ లోని వారి అత్త వారింట్లో రెండు కుటుంబాల వారిని సమావేశ పరిచి ఇకపై సంతోషంగా జీవిస్తామని కలిసి,మెలిసి ఉంటామని, ఆదర్శ దంపతులుగా వుంటామని ఇరువైపులను అంగీకరింపజేసి, వారి కాపురం నిలబెట్టిన, దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ వెంకటాపురం మండల కమిటీ పలువురి మన్నలను పొందారు. వాళ్ల బంధువులు దిశ వెల్ఫేర్ ఫౌండేషన్కు చెప్పడం జరిగింది మండల ప్రెసిడెంట్ అట్టం సుభద్ర వరంగల్ వెళ్లి ఇరు కుటుంబాలతో మాట్లాడి రెండు రోజులుగా కూర్చోబెట్టి, మాట్లాడి రెండు కుటుంబాలను ఒక్కటి చేసారు. అన్యోన్య దంపతులుగా జీవించాలని, అష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని నూగూరు వెంకటాపురం దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ మండల అధ్యక్షురాలు అట్టం సుభద్ర వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, కుటుంబాలను ఒకటి చేసి, పలువురు మన్నలను పొందారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now