మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ అజయ్
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యం తో చికిత్స పొందుతున్న మహిళకు రక్తం అవసరం కాగా కానిస్టేబుల్ అజయ్ శనివారం రక్తానందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని తుపాకు లగూడెం (ముకునూరు) గ్రామానికి చెందిన మహిళ ఏటూరునాగారంలోని సామాజిక ఆసుపత్రి లో అనారోగ్యంతో చేరగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని వెంటనే ఏ పాజిటివ్ రక్తం ఎక్కించాలని పేషెంట్ బంధువులకు వైద్యులు తెలిపారు. బంధువులు రక్తం కోసం ఆరా తీస్తుండగా విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ అజయ్ ఆసుపత్రికి చేరుకొని రక్తాన్ని అందించి ప్రాణదాత అయ్యాడు. ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం చేసిన అజయ్ ని స్థానిక ఎస్సై తాజుద్దీన్ అభినందించారు.
1 thought on “మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ అజయ్”