చాలీచాలని వేతనంతో అల్పాహరం ఎలా తయారు చేయాలి
ములుగు ప్రతినిధి : ఏఐటియూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ హెచ్ 80 గున్నాల రాజకుమారి అధ్యక్షతన ములుగు మండల మహసభ నిర్వహించారు.ఈమహసభకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పాఠశాలల్లో వంట కార్మికులుగా గత 22 సంవత్సరాలుగా వంటలు చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ వంట కార్మికులు మాత్రం కేవలం వేయి రూపాయల చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నారన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి 2 వేలు అధనముగా పెంచుతూ రూపాయలు 3వేలు అందిస్తామని 2022 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ఆ తర్వాత జరిగిన పోరాటాలకు జీవో నెంబర్ 8 విడుదల చేయిస్తూ వేతనం అందిస్తామన్నారు. కానీ వేతనాలు నేటికీ కార్మికులకు అందలేదు అన్నారు. మరి కార్మికులు ఎలా వంటలు చేయాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి అల్పాహారం అనే పథకాన్ని ఎలాంటి విధివిధానాలు లేకుండా, వంట కార్మికుల శ్రమ ప్రస్తావన లేకుండా ప్రకటించారన్నారు. అల్పాహారం తయారు చేయాలి అంటే రూపాయలు మూడు వేలు సరిపోతుందా, కనీస వేతనంగా రోజుకు రూపాయలు 500 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య, జేరిపోతుల పైడిబాబు,కార్మికులు గున్నాల రాజకుమారి,రాపర్తి ఉమాదేవి, ఆలోత్ కౌసల్య, బాలసాని ఇందిర, కొంకరెక్కల నవలోక, కుక్కల లక్ష్మి, అంకం పద్మ, భూక్య సారమ్మ, ఆసరి లక్ష్మి, రాధ, కాంబ్లీ, ఎల్లమ్మ, రాజక్క, బుల్లి, సరోజిని, సుగుణ,భాగ్య ఇంద్ర,పూల,రమ, రమ్యశ్రీ, సూరమ్మ, పద్మ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.