కౌషెట్టివాయిలో ఆరోగ్య శిబిరం – ఫీవర్ సర్వే
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ ఆదేశాలతో కౌషెట్టివాయి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించినట్లు కాటాపూర్ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ రంజిత్ వెల్లడించారు. కౌశెట్టివాయి గ్రామంలో 27ఇండ్లలో ఫీవర్ సర్వే చేసి 33మందికి జ్వర పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కౌశెట్టివాయి గ్రామంలో డ్రైడే నిర్వహించి, అను మానాస్పద జ్వరాల కేసుల కోసం ఆర్‌డీటీని నిర్వహించి దోమలు, లార్వా అభివృద్ధి నియంత్రణపై అవగాహన కల్పించామన్నారు. అంకంపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి నిల్వ లేకుండా చూడాలని, దోమల ఫాగింగ్ స్ప్రే నిర్వహించాలని జీపీ అధికారులకు సూచించారు. అనారోగ్యం నుండి కోలుకోవడానికి ప్రజలకు చికిత్స చేయడానికి కౌశెట్టివాయి గ్రామానికి చేరుకోవడానికి కాటాపూర్ నుంచి వైద్యాధికారులు, సిబ్బంది సుమారు 6కిలో మీటర్లు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ సీహెచ్వో సాయి, హెచ్ఏ పుష్ప, ఎల్లారేశ్వరి , ఆశా వర్కర్లు రమ, అనిత పాల్గొన్నారు.