ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం:కన్నాయిగూడెం మండ లంలోని దేవాదుల, లక్మిపురం గ్రామాల్లో మత్స్యకారులు మత్స్యకార దినోత్సవ సందర్భంగా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వాడ బలిజ కుల సంఘ మండల ఆధ్యక్షుడు ఎర్రోళ్ల సర్వేశ్ మాట్లాడుతూ.. గురువారం ప్రపంచం అంతా మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం మత్స్యకారులకు గుర్తింపు వున్నప్పటికీ, స్థానికంగా మనం వృత్తిరిత్యా వెనుకబడి వుండ టం చాలా బాధాకరామన్నారు. మన వృత్తిని, కులాన్ని బలో పేతం చేయడం కోసం పలు సలహాలు, సూచనలను వివరిం చారు. మనమంతా ఐక్యoగా లేనంత వరకు మనకు ఈ వెనుకబాటుతనం తపదన్నారు. ఇప్పటికైనా మన కులస్తులు, పిల్లలు, పెద్దలు, యువత, రాజకీయ నాయకులు మేల్కొని మన వృత్తిని, కులాన్ని, కుల సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి, ప్రభుత్వం అందించే పతకాలు అందరికి అందేలా చూడాల న్నారు. అంతేకాకుండా మత్స్యకారులు సొసైటీ సంఘాల సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగాలు గురించి అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల నరసింహారావు, వినోద్, రమాకాంత్, రామయ్యా, సతీష్, రాములు, రాంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.