రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్లనిర్మా ణానికి భూమి పూజ
నారాయణపేట, జూలై 29, తెలంగాణజ్యోతి : మఖ్తల్ నియోజకవర్గం లోని నర్వ మండలం రాంపూర్ గ్రామంలో ఇల్లు లేని ప్రతి బీదవాడికి స్వంత ఇంటి కలను నెరవేర్చాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు పథకం క్రింద నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇళ్లు కేటాయించగా, అందులో భాగంగా రాంపూర్ గ్రామానికి వచ్చిన ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షుడు నాగన్నగారి నరసింహారెడ్డి, ఎంపీడీ వో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ వినయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి భ ట్టుమూర్తి, గ్రామ కాంగ్రెస్ నాయకు లు, మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.