ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయ ఆప్టికల్, ఐ కేర్ సెంటర్, శరత్ మ్యాక్స్ విజన్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరానికి విశేష స్పందన లభించింది. కాటారం మండల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. జయ ఆప్టికల్, ఐ కేర్ సంస్థ, శరత్ మాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని కాటారం సిఐ నాగార్జున రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జున రావు మాట్లాడుతూ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆకుకూరలు, విటమిన్ ఏ, పాలు ఆహారం ఎక్కువ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ లింగ మూర్తి మాట్లాడుతూ క్యాంపులో పేరు నమోదు చేయించు కున్న వారికి ప్రత్యేక రాయితీపై కంటి శుక్లాలకు అధునాతన లేజర్ పరికరంతో కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ చేయించుకునే వారికి ఉచిత రవాణా, భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, చల్ల జక్కిరెడ్డి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.